శ్రీలలితా శివజ్యోతి సర్వకామద
శ్రీగిరినిలయా గిరామయాసర్వ మంగళా ||శ్రీలలిత||
జగముల చిరునగవుల మము పాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవన మయి
మాయని వరమియ్యవె పరమేశ్వరి మంగళదాయని ||శ్రీలలిత||
ఆందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలేచల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పుర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి ||శ్రీ లలిత||
for printouts .. ఇక్కడ క్లిక్ చెయ్యండి
! updated the link
No comments:
Post a Comment