ఘంటసాల వెంకటేశ్వరరావు


ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల.

తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయారు.

వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. more

కాటన్ దొర


కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్‌ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. more

english -> telugu dictionary

తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.

మీకు తెలుసా !



gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.



Tips:
1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  
2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.