కాటన్ దొర
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు ఇంజనీర్స్ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. more
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
గోగావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయంటే కారణం ఆయనే !కనుకనే విదేశీయుడైనా పల్లెల్లో ఆయన విగ్రహాలను నిలుపుకున్నారు . ధవళేశ్వరంలో ఆయన పేరుతొ మ్యూజియం కూడాఉంది . ఆయనకు నివాళులు .
నిస్వార్ధంగా సేవచేసిన బ్రిటిస్ అధికారుల్లో ఆయనా ఒకడు. కేవలం పని చేయటం కాక అత్యంత తెలివితేటలతో కాలువలను పల్లెపల్లెకూ వెళ్ళేలా ప్లాను చేసి అమలుచేయడం అంటే మాటలు కాదు.అందుకే విదేశీయుడైనా పల్లెపల్లెల్లో ఆయన పేరు ఎప్పుడూ వినిపిస్తుంది.
చిన్నప్పుడు ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ చూడటం మరిచిపోలేను. అప్పటికి మన ముఖ్యమంత్రి పేరు తెలీదుగానీ..కాటన్ ఎవరంటే మాత్రం టక్కున చెప్పేవాళ్ళం. నిజానికి మా 'కోనసీమ ' కాటన్ వల్లే ఈరోజు ఇలా వుంది.
Post a Comment