తక్షశిలలో రెండొవ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం

పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని విగ్రహాన్నికనుగొన్నారు. ఎర్ర సున్నపురాయితో తయారు కాబడిన అరుదైన ఈ బుద్ధుని విగ్రహం 13 సెంటీమీటర్లు పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది.

దీనిని క్రీస్తుశకం 2 శతబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. రెండు సింహాల సాయంతో ఉన్న సింహాసనంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహంకు తమకు తక్షశిలలో లభించిందని బుధవారం పాక్ పురాతత్వ శాఖలోని పరిశోధనలు, అన్వేషణ విభాగ డైరెక్టర్ ముహమ్మద్ అష్రాఫ్ ఖాన్ తెలిపారు.

ఈ విగ్రహాన్ని ఈ శతాబ్ది ఆవిష్కరణగా ఆయన వర్ణించారు. తక్షశిల పురావస్తు ప్రదర్శనశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధారామంలో ఈ విగ్రహాన్ని కనుగొన్నామని వెల్లడించారు. ఇది 2- 5 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా భావిస్తున్నామని చెప్పారు source

No comments: