
గోపన్న మేనమామ మాదన్న గారు అప్పటి గోల్కొండ నవాబు తానీషాగాటి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామగారి సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని సంపాదించెను. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.
అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్నగారు సంకల్పించిరి. అందుకు విరాళములు సేకరించిరి గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు ఆయన తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించిరి. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఇంకా ...
No comments:
Post a Comment