ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం. క్షేత్ర వైభవం శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర. సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి.. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామి వారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా, వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదో శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఇంకా ...
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక ...
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక మరే కారణం వల్ల నైనా return చెయ్యాలంటే మనము వెంటనే చేసేపని customer service కి ఫొన్ చేయ్యడం సర్వ సాధారణం. చాల వరకు websites లో customer service ఫొన్ నంబర్ ఉంచరు. ఉంచినా, ఆ నంబర్ లో automatic response ఉంటుంది. ఇక్కడ direct phone numbers ఉన్నాయి.
site: http://www.gethuman.com
మీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
site: http://www.gethuman.com
మీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
రామదాసు
ఈయన అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమంత్రి, కదంబ దంపతులకు జన్మించినారు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధులైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యులు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ తెలుగువారికి శ్రీరామదాసుగారి నుండి సంక్రమించిన పెన్నిధులు. ఆయన గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కధ యున్నది)
గోపన్న మేనమామ మాదన్న గారు అప్పటి గోల్కొండ నవాబు తానీషాగాటి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామగారి సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని సంపాదించెను. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.
అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని స్వతహాగా హరి భక్తులైన గోపన్నగారు సంకల్పించిరి. అందుకు విరాళములు సేకరించిరి గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు ఆయన తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.(ఈ విషయములో అనేకమైన కధలున్నాయి.) కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించిరి. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఇంకా ...

'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు ...
'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు (పంది+కొక్కు) నుంచి గ్రహించారు.
Subscribe to:
Posts (Atom)