గిడుగు వెంకట రామమూర్తి


గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవారు. 1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రిగారు చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయారు. విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే ఆయనకు పెండ్లి కూడా అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడీరాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటిరెండుభాగాలు, 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నారు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధానపాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో ఫస్టుక్లాసులో, రెండోర్యాంకులో ఉత్తీర్ణులైనారు. రాజావారి హైస్కూలు కాలేజి అయింది. అప్పుడు ఆయనకు కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది. ఇంకా ...

No comments: