కొంగర జగ్గయ్య



కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, వాచస్పతిగా పేరుగాంచాడు.

జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు.[1] విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీ లో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు కు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పని చేశాడు. ఇంకా ...

1 comment:

రానారె said...

తెలుగు వికీపీడియాను (తెవికీ) అందరికీ పరిచయం చేయాలనే మీ ప్రయత్నం బాగుంది. ఈ ఒక్కటపాతో ఈ ప్రచారోద్యమం ఆగిపోకుండా ఒక తెవికీ బొత్తాన్ని మీ బ్లాగులో కనిపించేలా చేస్తే బాగుంటుందికదా.