Showing posts with label భాష. Show all posts
Showing posts with label భాష. Show all posts

తెలుగు జాతి గీతకర్త శంకరంబాడి

"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి"

అన్న శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10,1914 - ఏప్రిల్ 8,1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. అలనాటి గాయని టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో విశ్వవ్యాపితమైన గీతం రాష్ట్ర గీతంగా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.

సుందరాచారి, 1914 ఆగష్టు 10 తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. ఇంకా

Google Chrome browser ఇప్పుడు తెలుగు లో ....


అతి తక్కువ సమయంలో నే popular అయిన browser Google Chrome. ఇప్పుడు ఇది తెలుగు లో కూడా చూడ వచ్చు. కాని ఇది ఎంత వరకు useful నో ....

తెలుగు లో ఎలా ఉంటుందో ఈ ప్రక్కన చూడండి.

సెట్టింగ్స్ కొరకు క్రింద image ని చూడండి.

ఘంటసాల వెంకటేశ్వరరావు


ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల.

తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయారు.

వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. more

english -> telugu dictionary

తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.

మీకు తెలుసా !



gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.



Tips:
1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  
2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.
జంతువుల Group ని english లో ఇలా పిలుస్తారు.

మరి తెలుగు లో !

ants: colony
bees: swarm
chicks: clutch
crows: murder
clams: bed
ducks: brace
elks: gang
fish: school
geese: flock
hares: down
hens: brood
kangaroos: troop
leopards: leap
lions: pride
monkeys: troop
oxen: yoke
seals: pod
sheep: flock
swans: bevy
whales: pod

'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు ...

'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు (పంది+కొక్కు) నుంచి గ్రహించారు.

తెలుగు మరియూ ఇతర భాషల origin


తెలుగు మరియూ ఇతర భాషల origin


మూలము (Source) ఇక్కడ నుండి

ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపతిక మీద ఏర్పడిన మొదటి రాష్ట్రం

ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపతిక మీద ఏర్పడిన మొదటి రాష్ట్రం.

నవంబర్ 1,1956 న అంధ్ర ప్రాంతం తెలంగాణ తో కలసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడింది.

తెలుగు భాష లో వాడుకలో ఉన్న పదములు అన్నీ అచ్చులతో (vowels) ముగుస్తాయి.

తెలుగు భాష లో వాడుకలో ఉన్న పదములు అన్నీ అచ్చులతో (vowels) ముగుస్తాయి.

ఒక్క తెలుగు భాషలోనె అక్షరాలని anticlockwise direction లో వ్రాస్తాము

ఒక్క తెలుగు భాషలోనె అక్షరాలని anticlockwise direction లో వ్రాస్తాము. మిగతా భాషలలో చాలావరకు అక్షరాలని clockwise direction లో వ్రాస్తారు.

మీకు తెలుసా ...

Hollywood కన్నా మనదెశం లో ఎక్కువ సినిమాలు produce అవుతాయి !

మా తెలుగు తల్లి ...


మా తెలుగు తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతాం
జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ

-�
'ఆంధ్ర' అనునది మొదట ఓక కొండ జాతి పేరు.

ఇంకా...
'తెలుగు' లేక 'తెనుగు' అను పదము Sanskrit నుంచి పుట్టి నదని వినికిడి !

Sanskrit లో త్రిలింగ అనగ మూడు శివలింగములు (కాళేశ్వరం,శ్రీశైలం,భీమేశ్వరం ) గల దేశమని అర్థం !


ఇంకా...