స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weeklys ని మీ Ipad లో చూడడానికి ...

స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weekly's ని మీ Ipad లో చూడడానికి ...

మొదట మీకు కావలసినవి ...
మీరు చెయ్యవలసింది
  • మొదట Dropbox account ని create చెయ్యండి
  • స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆరోగ్యం లాంటి తెలుగు weekly's ఇక్కడ download చేసి మీ local dropbox folder లోకి కాపీ చెయ్యాలి.
  • మీ IPad లో Dropbox app ని install చెయ్యాలి.
  • మీ ఎకౌంటు లోకి login అవ్వండి. మీ ఎకౌంటు లోకి లాగిన్ ఐయిన తరువాత మీ ఈ క్రింది విదంగా మీ files ని చూస్తారు. అందులోనుంచి మీకు కావలసిన pdf ని సెలెక్ట్ చెయ్యండి.

  • మీ file open అయిన తరువాత కుడి వైపు నున్న icon ని click చెయ్యండి. అందులో open in iBooks ని select చెయ్యండి.
  • ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన weekly మీ iBook library లోని pdf section లో ప్రతక్ష్యం అవుతుంది.
  • మీ file ని iBooks లో ఇలా చూడవచ్చు.



సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ

సాయి అష్టోత్రం by ఎక్కిరాల భరద్వాజ. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Sai Astotram by Ekkirala Bharadwaja.

link

! Updated the link. Resolved print issues

కంపెనీ open చెయ్యడానికి పట్టే సమయం ...

ఒక company స్టార్ట్ చెయ్యడానికి .....
New Zealand లో ... ఒక రోజు లో ...
USA లో ఒక వారం లో ...
మనకు ఒక నెలలో ( we made a huge improvement ) ...
చైనా లో ఒకటిన్నర నెలలో ...

ఎంతో ఎత్తులో మనం ...

చూద్దాం ... క్రిందకి ఎప్పుడు దిగుదామో ...
..
..

బహుశా ఇంకో 100 years లో ....

శ్రీలలిత మంగళహారతి ( Srilalitha mangala harathi )

శ్రీలలితా శివజ్యోతి సర్వకామద
శ్రీగిరినిలయా గిరామయాసర్వ మంగళా ||శ్రీలలిత||

జగముల చిరునగవుల మము పాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవన మయి
మాయని వరమియ్యవె పరమేశ్వరి మంగళదాయని ||శ్రీలలిత||

ఆందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి
అందాలేలేచల్లని తల్లికి చంద్ర హారతి
రవ్వల తళుకుల కలల
జ్యోతుల కర్పుర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి ||శ్రీ లలిత||

for printouts .. ఇక్కడ క్లిక్ చెయ్యండి
! updated the link

శ్రీరామ మంగళ హారతి (Raama chandraaaya Janaka)

రామ చంద్రాయ జనక రాజ జా మనోహరాయ
మామకా భీష్ట దాయ మహిత మంగళం ||రామ||

పూర్తి మంగళ హారతి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక్కడ సాయిబాబా భజన శ్లోకాలు ..

సాయిబాబా భజన శ్లోకాలు

మన హీరోల గురించి ...

ఇమేజ్ దెబ్బ తింటుంది అని భయం.
డబ్బులు రావని భయం.
అభిమానులు ఒప్పుకోరని సాకు.
హీరోయిన్ లేకుండా సినిమా ఒప్పుకోరు.
వచ్చినా రాక పోయినా స్టెప్పులు మానరు.

మీరేమంటారు ?

వీడు ఎలాంటి వాడు అయిన మంచి మాట చెప్పాడు (క్రింద క్లిప్పింగ్ చూడండి).

తెలుగు జాతి గీతకర్త శంకరంబాడి

"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి"

అన్న శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10,1914 - ఏప్రిల్ 8,1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. అలనాటి గాయని టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో విశ్వవ్యాపితమైన గీతం రాష్ట్ర గీతంగా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.

సుందరాచారి, 1914 ఆగష్టు 10 తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. ఇంకా

Google Chrome browser ఇప్పుడు తెలుగు లో ....


అతి తక్కువ సమయంలో నే popular అయిన browser Google Chrome. ఇప్పుడు ఇది తెలుగు లో కూడా చూడ వచ్చు. కాని ఇది ఎంత వరకు useful నో ....

తెలుగు లో ఎలా ఉంటుందో ఈ ప్రక్కన చూడండి.

సెట్టింగ్స్ కొరకు క్రింద image ని చూడండి.

ఘంటసాల వెంకటేశ్వరరావు


ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) తెలుగు జాతి మరవలేని ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల.

తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతన్నాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయారు.

వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, మరియు పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతం ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. more

కాటన్ దొర


కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్(జననం. మే 15, 1803 ఆక్స్‌ఫోర్డ్ - మరణం. జూలై 25,1899 డోర్కింగ్) బ్రిటీషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే మిగిలిపోయింది. 1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. more

english -> telugu dictionary

తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.

మీకు తెలుసా !



gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.



Tips:
1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  
2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.

తక్షశిలలో రెండొవ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం

పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని విగ్రహాన్నికనుగొన్నారు. ఎర్ర సున్నపురాయితో తయారు కాబడిన అరుదైన ఈ బుద్ధుని విగ్రహం 13 సెంటీమీటర్లు పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది.

దీనిని క్రీస్తుశకం 2 శతబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. రెండు సింహాల సాయంతో ఉన్న సింహాసనంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహంకు తమకు తక్షశిలలో లభించిందని బుధవారం పాక్ పురాతత్వ శాఖలోని పరిశోధనలు, అన్వేషణ విభాగ డైరెక్టర్ ముహమ్మద్ అష్రాఫ్ ఖాన్ తెలిపారు.

ఈ విగ్రహాన్ని ఈ శతాబ్ది ఆవిష్కరణగా ఆయన వర్ణించారు. తక్షశిల పురావస్తు ప్రదర్శనశాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధారామంలో ఈ విగ్రహాన్ని కనుగొన్నామని వెల్లడించారు. ఇది 2- 5 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదిగా భావిస్తున్నామని చెప్పారు source
జంతువుల Group ని english లో ఇలా పిలుస్తారు.

మరి తెలుగు లో !

ants: colony
bees: swarm
chicks: clutch
crows: murder
clams: bed
ducks: brace
elks: gang
fish: school
geese: flock
hares: down
hens: brood
kangaroos: troop
leopards: leap
lions: pride
monkeys: troop
oxen: yoke
seals: pod
sheep: flock
swans: bevy
whales: pod
లలిత హారతి తెలుగు లో ... ఇక్కడ
సాయి చాలీసా తెలుగు లో ... ఇక్కడ

కేంద్రం లో averege minister వయసు 65

గమత్తైన విషయం. ఈరొజు IBN లో devils advocate program చూస్తున్నెను. మన దెశం లో averege ministers వయసు 65. అందులో చాలా మంది 70-80 మధ్య వారు. ఆదే బ్రిటన్ లో ఇప్పుడు averege minister వయసు 45. అందులో ఒక్కడే 60 పైబడిన వాడు.