తెలుగు జాతి గీతకర్త శంకరంబాడి

"మా తెలుగు తల్లికి మల్లె పూ దండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి"

అన్న శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10,1914 - ఏప్రిల్ 8,1977) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. అలనాటి గాయని టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో విశ్వవ్యాపితమైన గీతం రాష్ట్ర గీతంగా ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది.

సుందరాచారి, 1914 ఆగష్టు 10 తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు. ఇంకా